ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అత్యవసర, నిత్యావసర వస్తువుల తయారీలో ఇ-పాస్‌ గడువు పెంపు - ఏపీలో ఇ పాస్‌ గడువు పెంపు

అత్యవసర, నిత్యావసర వస్తువుల తయారీ సంస్థల్లో పనిచేసే వారికి ఇ పాస్‌ గడువు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే 3 వరకు పొడిగిస్తూ కొవిడ్ రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ కార్యాలయం ఉత్తర్వులు ఇచ్చింది.

e-pass-extension-in-ap
e-pass-extension-in-ap

By

Published : Apr 21, 2020, 8:55 PM IST

అత్యవసర, నిత్యావసర వస్తువుల తయారీ సంస్థలో పని చేస్తున్న వారికి ఇచ్చిన ఇ-పాస్​ల గడువును మే 3 తేదీ వరకు పొడిగిస్తూ కొవిడ్ రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర సేవలకు సంబంధించి వైద్యారోగ్య శాఖ, ఆయా జిల్లాల కలెక్టర్‌లు సమీక్షించి పాస్‌లు జారీ చేస్తారని తెలిపింది. వీటి కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రెడ్ జోన్లు, కంటైన్మెంట్ జోన్లలోని వస్తూత్పత్తి పరిశ్రమలకు ఇ-పాస్‌లు జారీ చేయడం లేదని తెలిపింది.

ఇవీ చదవండి: కరోనా టెస్ట్ కిట్లను 2 రోజులు వాడొద్దు: కేంద్రం

ABOUT THE AUTHOR

...view details