గుంటూరు జిల్లా తెనాలిలో డ్వాక్రా సంఘాల సభ్యులు మాస్కులు తయారుచేస్తున్నారు. వీటిని ఆత్యవసర సేవలందిస్తున్న ఆర్టీసీ, పోలీస్, వైద్యసిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు అందిస్తున్నామని అధికారులు వెల్లడించారు. లాక్డౌన్ సందర్భంగా పని కల్పించినందుకు డ్వాక్రా సంఘాల మహిళలు.. అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
తెనాలిలో మాస్కులు తయారు చేస్తున్న డ్వాక్రా మహిళలు
రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్నందున మాస్కులు కొరత ఏర్పడింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు గుంటూరు జిల్లా తెనాలి పురపాలక సంఘం.. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మాస్కులు తయారు చేస్తున్నారు.
తెనాలిలో మాస్కులు తయారుచేస్తోన్న డ్వాక్రా మహిళలు