ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బస్సుయాత్ర కోసం మండుటెండలో మహిళలు' - మండుటెండలో బస్సుయాత్ర కోసం మహిళలను రప్పించారు

డ్వాక్రా మహిళలను ఆదరాబాదరా తీసుకొచ్చారు. ఎండలు మండుతున్నాయి..! నీడ లేదు.. నీరిచ్చే వారూ లేరు..! ఉన్నట్లుండి మజ్జిగ చుక్కను చూశాక.. ఒక్కసారిగా ఎగబడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలో కనిపించిన చిత్రాలివి..! మంత్రులు సామాజిక న్యాయం పేరుతో నిర్వహిస్తున్న బస్సుయాత్రకు ముందే.. తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని డ్వాక్రా మహిళలను వారధి వద్దకు తరలించారు. దీంతో మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

Dwakra groups women faced problems for taking them to ysrcp bus yatra in guntur
బస్సుయాత్ర కోసం మండుటెండలో మహిళలు

By

Published : May 28, 2022, 3:59 PM IST

బస్సుయాత్ర కోసం మండుటెండలో మహిళలు

సామాజిక న్యాయం పేరుతో మంత్రులు నిర్వహిస్తున్న బస్సుయాత్రకు ముందే.. గుంటూరు జిల్లా తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని డ్వాక్రా మహిళలను వారధి వద్దకు తరలించారు. తాడేపల్లి వద్ద మంత్రులకు స్వాగతం పలికేందుకు.. అధికార పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. మండుటెండలో మహిళలను అక్కడికి ఆటోల్లో తరలించగా.. వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

వారధి దగ్గర మీటింగ్ ఉందని చెప్పి.. మెప్మా అధికారులు మహిళలను ఆటోల్లో తరలించారు. ఎండ వేడిని తట్టుకోలేక మహిళలు వారధి వద్ద ఉన్న ఇంటర్ బోర్డు కార్యాలయంలోని సెల్లార్లలో తలదాచుకున్నారు. మెప్మా అధికారుల తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటింగ్ ఉందని చెప్పి పదింటికల్లా ఇక్కడికి రమ్మన్నారని మహిళలు వాపోయారు. సుమారు రెండు గంటలు ఎండ వేడిని భరించలేక సెల్లార్ లోకి వచ్చామని మహిళలు తెలిపారు. దాదాపు రెండు గంటల తర్వాత ఎండలో ఉన్న మహిళలకు అధికారులు మజ్జిగ పంపిణీ చేశారు. మజ్జిగ కోసం మహిళలు ఎగబడ్డారు.



ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details