ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతి దీక్షా శిబిరాలలో కొలువైన అమ్మవారు - అమరావతి ఉద్యమం

అమరావతి దీక్షా శిబిరాలలో అమ్మవారు కొలువయ్యారు. శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి విగ్రహాలను ప్రతిష్టించి మహిళలు పూజలు చేశారు. దసరా ఉత్సవాలు ముగిసేలోపు అమరావతికి మద్దతుగా నిర్ణయం వస్తుందనే ఆశాభావం వ్యక్తంచేశారు.

dusserah utsav at amaravathi protest
అమరావతి దీక్షా శిబిరాలలో కొలువైన అమ్మవారు

By

Published : Oct 17, 2020, 5:22 PM IST

శరన్నవరాత్రుల సందర్భంగా అమరావతి దీక్షా శిబిరాలలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. దసరా ఉత్సవాలు ముగిసేలోపు అమరావతికి మద్దతుగా ఏదో ఒక నిర్ణయం వస్తుందని మహిళలు ఆశాభావం వ్యక్తం చేశారు. అమ్మవారే ఉద్యమకారిణిలా వచ్చి తమ శిబిరాలలో ఆసీనులయ్యారని మహిళలు చెప్పారు.

తుళ్లూరు మండలం మందడం, బోరుపాలెం, అనంతవరం, అబ్బరాజుపాలెం, వెంకటపాలెం దీక్షా శిబిరాలలో అమ్మవారి విగ్రహాలను ప్రతిష్టించారు. 9 రోజులు ఆ తల్లికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తామన్నారు. ఉద్ధండరాయునిపాలెంలో రైతుల దీక్షకు 8 ఏళ్ల బాలుడు అఖిల్ తాను దాచుకున్న రూ. 960లను విరాళంగా ఇచ్చాడు.

ABOUT THE AUTHOR

...view details