గుంటూరు నగరంలోని రెడ్ జోన్లలో ప్రజలు బయటకు రాకుండా పోలీసులు, నగరపాలక సంస్థ యంత్రాంగం చర్యలు చేపట్టారు. అక్కడ బారికేడ్లు, ఇనుప కంచె వేసినా కొందరు వాటిని మెల్లగా తప్పించి వస్తున్నారు. ఇనుప కంచె ప్రమాదకరమని తెలిసినా ఏదో ఒక వస్తువు కొనుగోలు కోసం బయటకు రావాల్సి వస్తోందని స్థానికులంటున్నారు. కంటైన్మెంట్ జోన్లలో అన్ని సరుకులు ఇళ్ల వద్దకే పంపించి విక్రయిస్తున్నట్లు అధికారులు చెబుతున్నా... తమ అవసరాలు తీర్చే స్థాయిలో అవి లేవని.. అందుకే బయటకి రావల్సివస్తోందని అంటున్నారు. ఇలా కంచె తీసి ప్రజలు కరోనాకు దగ్గరవుతున్నారని పోలీసులు ఆందోళనకు గురవుతున్నారు. మళ్లీ.. ఆ ఇనుప కంచెను సరిచేస్తున్నారు.
కంచె తొలగిస్తున్నారు... కరోనాకు దగ్గరవుతున్నారు! - గుంటూరులో లాక్డౌన్ వార్తలు
గుంటూరులో ప్రజలు లాక్ డౌన్ ఆంక్షలను పట్టించుకోకుండా.. కంచెలను తప్పించుకుని మరీ రోడ్లపైకి వస్తున్నారు. తమ ఇళ్ల వద్దకు.. అధికారులు చెబుతున్నట్టుగా సరుకులు రావడం లేదని ఆరోపిస్తున్నారు.

due to lockdown people are removing the fence in the red zone at guntur