గుంటూరు నగరం నల్లచెరువులోని విద్యుత్, రెవెన్యూ కార్యాలయంలో.. వినియోగదారులు చెల్లించే విద్యుత్ బిల్లులు, నగదును సిబ్బంది ఇస్త్రీ చేస్తున్నారు. ఇస్త్రీ పెట్టెతో రెండు మూడు పర్యాయాలు నోటుని అటు ఇటు తిరగేసి.. అది కొంచెం వేడెక్కేవరకూ ఇస్త్రీ చేస్తున్నారు. నోట్ల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెెందుతుందన్న భయంతో ఈ పద్ధతి అవలంబిస్తున్నట్లు సిబ్బంది తెలిపారు.
విద్యుత్ సిబ్బంది డబ్బులు ఇస్త్రీ చేస్తున్నారు.. కారణం ఇదీ..! - గుంటూరులో విద్యుత్ బిల్లులు ఇస్త్రీ చేస్తున్న అధికారులు
కరోనా భయంతో గుంటూరు జిల్లాలో విద్యుత్, రెవెన్యూ శాఖల సిబ్బంది వినియోగదారులు ఇచ్చే డబ్బులు, బిల్లులను ఇస్త్రీ చేసి తీసుకుంటున్నారు. నోట్ల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతున్న ఆందోళనతో ఇలా చేస్తున్నట్లు తెలిపారు.
due to corona Power bills and money are being ironed out by the power department staff at guntur