గుంటూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకూ 283 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు నగరంతో పాటు నరసరావుపేటలో కేసుల తాకిడి అధికంగా ఉంది. రెడ్ జోన్ల పరిధిలో ఆంక్షలు కఠినతరం చేశారు. నరసరావుపేటలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించారు. రామిరెడ్డిపేట, వరవకట్ట ప్రాంతాల్లో పోలీసులను భారీగా మోహరించారు. జిల్లాలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు వేగవంతం చేయగా... కేసులు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న వలసకూలీలకు సైతం ర్యాపిడ్ విధానంలో పరీక్షలు నిర్వహించి సొంతూళ్లకు పంపిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 15వేల మంది వరకూ వలస కూలీలున్నట్టు అంచనా వేస్తుండగా... నిన్న సుమారు 3వేల మంది జిల్లా నుంచి వెళ్లిపోయారు.
గుంటూరులో ఆంక్షలు కఠినతరం
కరోనా మహమ్మారి గుంటూరులో కల్లోలం సృష్టిస్తోంది. కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ మేరకు అధికారులు... రెడ్జోన్లలో ఆంక్షలు కఠినతరం చేశారు.
due to corona Lockdown strictly imposed in guntur