కరోనా టెస్టులు చేయడంలో దేశంలోనే మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని... నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామానికి చెందిన 600 మంది పేదలకు నిత్యావసర సరకులు అందజేశారు.
లాక్డౌన్ కారణంగా పేదలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. భౌతికదూరం పాటిస్తూ యువకులు పని చేసుకోవాలని సూచించారు.