కరోనా లాక్డౌన్ కారణంగా మూగజీవాలు ఆకలితో అల్లాడుతున్నాయి. ప్రజలు ఎవరూ బయటకు రాకపోవటంతో శునకాలు ఆహారం లేక ఇబ్బంది పడుతున్నాయి. గమనించిన గుంటూరు నగరపాలక సంస్థ శానిటరీ ఇన్‌స్పెక్టర్ విజయభాస్కర్ వాటి ఆకలి తీర్చే కార్యక్రమం చేపట్టారు. విధులకు వెళ్లే సమయంలో తన వెంట బిస్కెట్ ప్యాకెట్లను తీసుకువెళ్లి... శునకాలు కనిపించిన చోట ఆగి.. వాటికి బిస్కట్లు పెట్టి ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఆకలితో అలమటిస్తున్న మూగజీవాలు.. స్పందిస్తున్న దాతలు - గుంటూరులో కరోనా వార్తలు
లాక్డౌన్ విధించడం వల్ల మూగజీవాల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవడంతో జంతువులకు ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్నాయి. మానవతా దృక్పథంతో కొందరు దాతలు.. వాటి ఆకలిని తీరుస్తున్నారు.
due to corona lockdown A man feeds for dogs in guntur