గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఓ చిరు వ్యాపారికి మున్సిపల్ అధికారులు రూ.200 జరిమానా విధించారు. తాను ఉదయం నుంచి సంపాదించింది రూ.60 మాత్రమే అని... రూ.200 ఎలా కట్టాలని అంటూ.. కోపంతో ఆ వ్యాపారి దుకాణాన్ని తానే ధ్వంసం చేసుకున్నాడు. సామాన్లు రోడ్డుపైకి విసిరివేశాడు. స్థానికులు వచ్చి ఓదార్చారు. ప్లాస్టిక్ కంపెనీని మూయించటం చేతకాదు కాని... తమలాంటి చిన్నవ్యాపారులపైనా మీ పెత్తనం అంటూ... అధికారులను నిలదీశాడు.
పాస్టిక్ వాడకంపై జరిమానా... రగిలిన హృదయం..! - ప్లాస్టిక్ వాడినందుకు జరిమాన గుంటూరు జిల్లా
ప్లాస్టిక్ వాడినందుకు రూ.200 జరిమానా విధించారని... ఓ చిరువ్యాపారి తన దుకాణాన్ని తానే నాశనం చేసుకున్నాడు. సామాన్లు అన్నీ పడేసి... చిందరవందరగా చేశాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో జరిగింది.
జరిమాన విధించారని... దుకాణాన్ని నాశనం చేసుకున్నాడు..!