అనధికార సైలెన్సర్లతో శబ్ద కాలుష్యం చేస్తున్న బుల్లెట్ వాహనాల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు గుంటూరు ఉప రవాణా కమిషనర్ మీరా ప్రసాద్ తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు తనిఖీలు చేస్తున్నామని పేర్కొన్నారు. మోటార్ వాహనాల చట్టం 1988 సెక్షన్ 190(2) ప్రకారం అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ వాడటం నేరమన్నారు. పోలీసుల తనిఖీల్లో ఇప్పటివరకు 15 వాహనాలు పట్టుబడ్డాయి.
సైలెన్సర్లు మార్చిన వాహనాలను పట్టుకున్న పోలీసులు
గుంటూరులో అనధికార సైలెన్సర్లు పెట్టుకున్న ద్విచక్రవాహనదారులకు జరిమానా విధిస్తున్నట్లు ఉపరవాణా కమిషనర్ మీరా ప్రసాద్ అన్నారు.
సైలెన్సర్లు మార్చిన వాహనాలను పట్టుకున్న పోలీసులు