గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్ హై స్కూల్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ కేంద్రానికి చేరువలో టెంట్లు వేసి భోజనాలు పెట్టి.. కొందరు నాయకులు నగదు పంపిణీ చేస్తూ ఓటర్లను మభ్యపెడుతున్నారని డీఎస్పీ స్రవంతిరాయ్కి ఫిర్యాదులు అందాయి. తక్షణమే స్పందించిన డీఎస్పీ... చర్యలు తీసుకున్నారు.
ఈ క్రమంలో.. సదరు రాజకీయ పార్టీ నేతలు తమ ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకున్న టెంట్లు తీయటానికి వీల్లేదంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎన్నికల సందర్భంగా 144 సెక్షన్ అమల్లో ఉన్న కారణంగా టెంట్లు వేయటానికి వీల్లేదని పోలీసులు వారికి స్పష్టం చేశారు. అక్కడి నుంచి టెంట్లు తీయించి.. వారిని చెదరగొట్టారు.