మంగళగిరిలో 2018 బ్యాచ్ డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఏడాదిపాటు అనంతపురం పీటీసీలో 25 మంది డీఎస్పీలు శిక్షణ పొందారు. పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొని పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి.. సీఎం పిస్టల్‌ను రవికిరణ్ అందుకున్నారు. ప్రతిభ కనబరిచినవారికి ట్రోఫీలు బహూకరణ చేశారు. శాంతిభద్రతలు కాపాడటంలో పోలీసుల పాత్ర కీలకమని డీజీపీ గౌతమ్ సవాంగ్ వ్యాఖ్యానించారు.
మంగళగిరిలో డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్ - home minister sucharitha at mangalagiri passing out parade
గుంటురు జిల్లా మంగళగిరిలో 2018 బ్యాచ్ డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ పరేడ్ మైదానంలో నిర్వహించిన ఈ పరేడ్‌కు హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ హాజరయ్యారు.
![మంగళగిరిలో డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4766712-506-4766712-1571203546451.jpg)
dsp passing out parade at mangalagiri
25 మందిలో 11మంది మహిళా డీఎస్పీలు వుండటం చాలా సంతోషంగా ఉందని హోమ్ మినిస్టర్ మేకతోటి సుచరిత అన్నారు. ప్రజలకు ఎటువంటి ఆపదవచ్చినా ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసేనని గుర్తు చేశారు. విధినిర్వహణలో వచ్చే అడ్డంకులు సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచించారు.
ప్రజాజీవితంలో వున్న అధికారులు ప్రజలకు అండగా వుండాలని ఆమె ఆకాంక్షించారు.
మంగళగిరిలో డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్
ఇదీ చదవండి:విశాఖలో నౌకా దళ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్
Last Updated : Oct 16, 2019, 3:56 PM IST