ఎన్నికలకు ముందు.. జగన్ ఇచ్చిన హామీని ఇప్పుడు తీర్చాలని 1998 - డీఎస్సీ అర్హులు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం నివాసం ఎదుట ఆందోళన చేశారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని... ఆందోళనను అడ్డుకున్నారు. సీఎంను కలిసేందుకు కనీసం నలుగురినైనా అనుమతించాలని కోరినా పోలీసులు నిరాకరించారు.
సీఎం నివాసం ఎదుట డీఎస్సీ - 98 అభ్యర్థుల ఆందోళన - తాడేపల్లి సీఎం జగన్ నివాసం ఎదుట ఆందోళన
తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం ఎదుట డీఎస్సీ-98 అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు.
సీఎం జగన్ నివాసం ఎదుట డీఎస్సీ-98 అభ్యర్థలు ఆందోళన
TAGGED:
dsc-98 latest news