Drugs in the lives of young people: హైదరాబాద్ నగర శివారులోని ప్రముఖ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఐటీ కంపెనీలో కొలువు సంపాదించాడు. స్నేహితులతో కలసి చేసుకునే పార్టీలో మాదకద్రవ్యాలు వాడుతూ పోలీసులకు చిక్కాడు. చదువుల్లో ర్యాంకర్‌గా ప్రతిభ చాటిన కుమారుడు డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడనే విషయం తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. స్వలింగ సంపర్కుల యాప్‌లో సభ్యుడిగా చేరి నెమ్మదిగా ఇలా తప్పటడుగు వేసినట్టు కౌన్సెలింగ్ సమయంలో పోలీసులు గుర్తించారు.
3 నెలలుగా సైకాలజిస్టులతో కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నట్లు యువకుడి తల్లి చెప్పారు. ప్రైవేటు సంస్థలో ఉన్నతోద్యోగి. కుమారుడిని అమెరికా పంపే ఏర్పాట్లలో ఉన్నారు. ఇంతలో ఊహించని షాక్. ఇటీవల గోవాలో చిక్కన డ్రగ్ స్మగ్లర్ల వద్ద యువకుడి ఫోన్ నంబరు దొరికిందంటూ నగర పోలీసుల నుంచి ఆ తండ్రికి ఫోన్‌కాల్. స్నేహితులతో కలసి గోవా వెళ్లినపుడు ఎల్‌ఎస్‌డీబ్లాట్స్ తీసుకున్నానని, ఏడాదిగా తరచూ వాటిని నుంచి తెప్పించుకొని వాడుతున్నట్టు వివరించాడని బాధితుడి తండ్రి తెలిపారు.