ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సచివాలయం కిటికీ అద్దాలు ధ్వంసం చేసిన తాగుబోతు - నరసరావుపేటలో సచివాలయం కిటికీ అద్దాలు ధ్వంసం చేసిన తాగుబోతు

సచివాలయం వద్ద మూత్ర విసర్జన చేయకూడదని అడ్డుకున్న వార్డు వాలంటీర్​పై తాగుబోతు దాడి చేశాడు. గుంటూరు జిల్లా నరసరావుపేట 3వ వార్డులోని సచివాలయం కిటికీ అద్దాలను పగులగొట్టాడు.

sachivalayam window glass break
తాగుబోతు దాడిలో పగిలిన అద్దం

By

Published : Nov 21, 2020, 5:30 PM IST

బండరాయితో వార్డు సచివాలయం అద్దాలు పగులగొట్టాడో తాగుబోతు. గుంటూరు జిల్లా నరసరావుపేట 3వ వార్డులో జరిగిందీ ఘటన. దిశ పోలీసుల సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో.. అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి మద్యం సేవించి అక్కడకు వచ్చినట్లు వాలంటీర్ నాగూర్ వలి తెలిపాడు.

తాగుబోతు దాడిలో పగిలిన అద్దం

ద్విచక్ర వాహనంపై వచ్చిన ఆ వ్యక్తి.. ఏర్పాట్లు చేస్తున్న ప్రాంతంలో మూత్ర విసర్జన చేయబోయాడని వాలంటీర్ పేర్కొన్నాడు. ఇక్కడ మూత్ర విసర్జన చేయవద్దని వారించినందుకు తనపై దాడి చేశాడని వాపోయాడు. అనంతరం బండరాయితో సచివాలయం కిటికీ అద్దాలను పగులగొట్టాడని వివరించాడు. ఘటనపై రెండవ పట్టణ పోలీసులకు పిర్యాదు చేసినట్లు వెల్లడించాడు.

ఇదీ చదవండి:గ్రామ సచివాలయాల్లోనే రవాణా శాఖ సేవలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details