గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం అబ్బూరులో గంగదరి వెంకట్రావు, అంబటి శ్రీను వర్గాల మధ్య మురుగు కాల్వ విషయంలో గొడవ పడ్డారు. మరుగునీరు తమ ఇళ్ల ముందు నుంచి వెళ్లకుండా దిగువ ప్రాంతాల వారు అడ్డుకున్నారు. ఫలితంగా సోమవారం రాత్రి వాగ్వాదానికి దిగిన వాళ్లు కర్రలతో తలపడ్డారు.
రెండు వర్గాల మధ్య ఘర్షణ.. 10 మందికి గాయాలు
మురుగు కాల్వ విషయంలో చెలరేగిన వివాదం గుంటూరు జిల్లా అబ్బూరులో రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. కర్రలతో పరస్పరం దాడి చేసుకున్న ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న సత్తెనపల్లి పోలీసులు... కొందరిని అరెస్టు చేశారు.
రెండు వర్గాల మధ్య ఘర్షణ.. 10 మందికి గాయాలు
ఈ ఘర్షణలో 2 వర్గాలకు చెందిన 10 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వాళ్లను సత్తెనపల్లి ఆసుపత్రికి తరలించామని. తలకు గాయాలైన నలుగురిని మాత్రం గుంటూరు జీజీహెచ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు... దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
పాత కక్షలే....
అబ్బూరుకు చెందిన గంగదరి వెంకట్రావు, అంబటి శ్రీను వర్గాలకు గతంలోనూ పాత కక్షలున్నాయి. ఫలింతగా చిన్న విషయానికే గొడవకు దిగి పరస్పర దాడుల వరకూ వెళ్లిందని పోలీసులు చెబుతున్నారు. దాడికి పాల్పడిన వారిలో కొందరిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: