ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెనాలిలో ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం నిలిపివేత

గుంటూరు జిల్లా తెనాలిలో ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని వాహనదారులు నిలిపివేశారు. బ్యాంకులు ఇష్టానుసారంగా ఈఎంఐలు కట్ చేస్తున్నాయని వారు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. న్యాయం జరిగాకే రేషన్ పంపిణీ చేస్తామని వారు స్పష్టం చేశారు.

Tenali Ration distribution owners protest
తాహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న నిరసనకారులు

By

Published : Apr 1, 2021, 12:12 PM IST

తాహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న నిరసనకారులు

గుంటూరు జిల్లా తెనాలిలో ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని వాహన యజమానులు నిలిపివేశారు. వాయిదాల పేరుతో బ్యాంకర్లు తమ అకౌంట్ల నుంచి ఇష్టానుసారంగా డబ్బులు కట్ చేస్తున్నారని వారు ఆరోపించారు. తెనాలి తహసీల్దార్ కార్యాలయం వద్దకు రేషన్ వాహనాలతో సహా వచ్చి ఆందోళన చేపట్టారు. నెలకు రూ.3 వేలు కట్ కావాల్సి ఉండగా..అంతకంటే ఎక్కువ కట్ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. కొందరికి 9 వేల రూపాయలు కూడా కట్ చేశారని..అలాంటప్పుడు తమకేం మిగులుతుందని ఆవేదన వెలిబుచ్చారు. తమ సమస్య పరిష్కరించిన తర్వాతే రేషన్ పంపిణీ చేపడతామని స్పష్టం చేశారు. అధికారులు తమ సమస్యని పరిష్కరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details