కోవిడ్ –19 నివారణ, సహాయ చర్యల కోసం సీఎం సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి.
- చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు తరపున కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన డీసీసీబీ ఛైర్పర్సన్ మొగసాల రెడ్డమ్మ, మొగసాల కృష్ణమూర్తి చెక్కును అందించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పలమనేరు ఎమ్మెల్యే వెంకట్‌గౌడ్ వారి వెంట ఉన్నారు.
- శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం ప్రజలు, వర్తక, వాణిజ్య సంఘాలు ముఖ్యమంత్రి సహాయ నిధికి 53,03,343 రూపాయలు విరాళం అందించారు. చెక్కును సీఎం వైఎస్ జగన్‌కు పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు, బడగల బాలచంద్రుడు, టి.సురేంద్ర, కృష్ణారెడ్డి అందజేశారు.
- సీఎంఆర్ఎఫ్కు గుంటూరు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ 25 లక్షల రూపాయలు విరాళం ఇచ్చింది. సీఎం జగన్‌ను కలిసిన గుంటూరు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి. భాస్కరరావు, సెక్రటరీ వి.వి.రత్న గుప్త చెక్కు అందజేశారు. వారి వెంట శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి పాల్గొన్నారు.