ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీజీహెచ్​కు థర్మోస్కానర్లు అందించిన వైద్యులు - Guntur General Hospital latest news

గుంటూరు సర్వజనాస్పత్రికి రూ.3 లక్షల విలువైన ధర్మో స్కానర్లు అందాయి. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రుల రాష్ట్ర అధ్యక్షుడు, సాయి భాస్కర్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ .బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, డాక్టర్ .దీప్తిరెడ్డి దంపతులు వీటిని సమకూర్చారు.

donated thermo scanners for   Guntur General Hos
జీజీహెచ్​కు థర్మోస్కానర్లు అందించిన వైద్యులు

By

Published : May 20, 2020, 9:18 AM IST

గుంటూరు సర్వజనాస్పత్రికి ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రుల రాష్ట్ర అధ్యక్షుడు, సాయి భాస్కర్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, డాక్టర్ దీప్తిరెడ్డి దంపతులు రూ. 3 లక్షల రూపాయల విలువైన థర్మో స్కానర్లను అందజేశారు. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న వేళ.. వీటిని వైద్యులు వినియోగించాలని కోరారు.

జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజునాయుడుకు నరేంద్రరెడ్డి ఈ పరికరాలను అందజేశారు. కరోనా పోరాటంలో జీజీహెచ్ వైద్యులు, సిబ్బంది చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. అలాంటివారికి అండగా నిలవడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నట్లు నరేంద్రరెడ్డి చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details