ఇసుక వారోత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం 5 నెలల సమయం ఎందుకు తీసుకుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో డొక్కా సీతమ్మ ఆహార శిబిరాన్ని ప్రారంభించిన ఆయన.. తప్పుడు ఇసుక పాలసీతో 50 మందిని చంపేశారని అన్నారు.
ప్రజలను చంపేస్తుంటే మౌనంగా ఉండాలా: పవన్ - మంగళగిరిలో జనసేన డొక్కా సీతమ్మ ఆహార శిబిరం
రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలను ప్రారంభించారు. భవన నిర్మాణ కార్మికుల కోసం ఉచితంగా ఆహారం సరఫరా చేస్తున్నారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రారంభించారు. భవన నిర్మాణ కార్మికులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గ కేంద్రాల్లో శిబిరాలు ఏర్పాటు చేశారు.
pawan