జాతీయ వైద్య కమిషన్ బిల్లును రద్దు చేయాలంటూ జూనియర్ వైద్యులు చేపట్టిన నిరసనలు గుంటూరులో 4వ రోజుకి చేరాయి. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఎన్ఎంసీ బిల్లు ఎత్తివేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. బిల్లులోని అంశాలు ప్రతిపాదించకుండా ఏవిధంగా పాస్ చేశారంటూ జూనియర్ వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే బిల్లుని వెనక్కి తీసుకోవాలని... లేకపోతే 24 గంటల వరకు అత్యవసర సేవలు కూడా నిలిపివేస్తామని హెచ్చరించారు.
ఎన్ఎంసీ బిల్లుపై 4వ రోజుకు చేరిన నిరసన - 4వ రోజు చేరిన..వైద్యుల నిరసన
కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి జూనియర్ వైద్యులు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు.
4వ రోజు చేరిన..వైద్యుల నిరసన