గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తన బిడ్డ మృతి చెందిందని బాధితురాలు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. రాము, ఖాసిం బీ దంపతులకు ముగ్గురు సంతానం. నాలుగవ సంతానం కోసం నెలలు నిండిన ఖాసిం బీ.. ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. అయితే వైద్యులు మాత్రం ఆమెను అడ్మిట్ చేసుకోలేదు. సాయంత్రం 8 గంటలకు రమ్మన్నారు. ఖాసిం బీ ఇంటికి వెళ్లిన వెంటనే ఓ బిడ్డకు జన్మనించింది. ఆ బిడ్డ కొద్ది క్షణాల్లోనే మృతి చెందింది. తల్లి పరిస్థితి విషమంగా ఉన్న కారణంగా.. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. తల్లిని వైద్యులు పరీక్షించి ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందన్నారు.
శిశువు మృతితో వైద్యులపై బాధితుల ఆగ్రహం - baby died at guntur hospital
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బాధితురాలు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు నిరసన చేపట్టారు.
![శిశువు మృతితో వైద్యులపై బాధితుల ఆగ్రహం Doctors outraged over infant death](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6627274-710-6627274-1585770843974.jpg)
శిశువు మృతితో వైద్యులపై ఆగ్రహం