ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ నిబంధనతో.. వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులకు ఇబ్బందులు - లాక్​డౌన్​తో వైద్యులు, మున్సిపల్ కార్మికుల ఇబ్బందులు

గుంటూరు జిల్లాలో లాక్​డౌన్​ను పోలీసులు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. విధులకు హాజరవుతున్న వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులను సైతం నిలిపివేయటం వల్ల పోలీసు చర్యలపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను సమయానికి విధులకు హాజరయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

doctors and municipal workers are affected due to lock down at guntur
లాక్​డౌన్​తో వైద్యులు, మున్సిపల్ కార్మికుల ఇబ్బందులు

By

Published : Apr 10, 2020, 10:43 PM IST

లాక్​డౌన్​తో వైద్యులు, మున్సిపల్ కార్మికుల ఇబ్బందులు

గుంటూరు జిల్లాలో లాక్ డౌన్​ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. జిల్లాలోని శంకర్ విలాస్ కూడలి, మణిపురం బ్రిడ్జి, కంకర బ్రిడ్జిల వద్ద రాకపోకలను పూర్తిగా నిలిపివేయటం వల్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో విధులకు వెళ్లే వైద్యులు, ఆరోగ్య శాఖ, పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. 9 గంటల తర్వాత మాత్రమే వాహనాలకు అనుమతి ఇవ్వాలన్న జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు పోలీసులు ఎవ్వరిని రోడ్లపై తిరగనివ్వలేదు. విధులకు హాజరు కావాల్సిన వారిని సైతం ఆపివేశారు. అధికారులు స్పందించి... తమ విధులకు ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:మాస్క్​ లేకుండా తిరిగితే వెయ్యి రూపాయల జరిమానా !

ABOUT THE AUTHOR

...view details