లాక్‌డౌన్ పూర్తయ్యేవరకు మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కోరారు. కరోనా సమయంలో మద్యం విక్రయానికి రాష్ట్రాలకు అనుమతి ఇవ్వడం సరికాదని హితవు పలికారు. మద్యాన్ని ఆర్థికవనరుగా పరిగణించడం అనైతికమని విమర్శించారు. బిహార్ ఎప్పట్నుంచో మద్యనిషేధం అమలు చేస్తున్న విషయాన్ని నారాయణ గుర్తు చేశారు.
'మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వొద్దు' - సీపీఐ నారాయణ వార్తలు
లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా గ్రీన్జోన్లలో మద్యం అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం అనుతివ్వడాన్ని సీపీఐ తప్పుబట్టింది. మద్యాన్ని ఆర్థికవనరుగా పరిగణించడం అనైతికమని మండిపడ్డారు పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ.
cpi narayana latest news