Governor and CM Diwali Wishes: దీపావళి సందర్భంగా విజయవాడలోని రాజ్‌భవన్ విద్యుత్ దీప కాంతులతో ముస్తాబయింది. రాజ్ భవన్‌లోని అన్ని భవనాలకు వివిధ రంగుల విద్యుత్ దీపాలను అలకరించారు. దీంతో రాజ్ భవన్లో పండుగ వాతావరణం నెలకొంది. వెలుగుల పండుగ దీపావళి శుభవేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి దివ్య దీపాలు అందరికీ శాంతి, శ్రేయస్సు, ఆనందాన్ని కలిగించాలన్నారు. దీపావళి చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయాలకు ప్రతీకగా నిలుస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. మంచి ఆలోచనలు చేసేందుకు, సద్భావనతో కొనసాగడానికి అవసరమైన శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తాయన్నారు. ఇలాంటి పండుగలు చీకటి నీడలను జయించి శాంతి, మత సామరస్యంతో కూడిన సమాజాన్ని నిర్మించడానికి మనందరికీ స్ఫూర్తి నిస్తాయని గవర్నర్ హరి చందన్ వివరించారు.
రాష్ట్ర ప్రజలకు గవర్నర్, సీఎం దీపావళి శుభాకాంక్షలు - దీపావళి శుభాకాంక్షలు
Diwali wishes: దీపావళి దివ్య దీవాలు అందరికీ శాంతి, శ్రేయస్సు, ఆనందాన్ని కలిగించాలని గవర్నర్, సీఎం ఆశించారు. దీపావళి సందర్బంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పండగలు చీకటి నీడలను జయించి.. శాంతి, మత సామరస్యంతో కూడిన సమాజం నిర్మించడానికి మనందరికీ స్ఫూర్తినిస్తాయని గవర్నర్ అన్నారు. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని సీఎం ఆకాంక్షించారు.

governor cm jagan
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ సీఎం జగన్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకటిపై వెలుగు.. చెడుపై మంచి.. అజ్ఞానంపై జ్ఞానం.. దుష్టశక్తులపై దైవశక్తి... సాధించిన విజయాలకు దీపావళి ప్రతీక అని సీఎం అన్నారు. దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో ఆనంద కాంతులు నింపాలని ఆకాంక్షించారు.ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలన్న సీఎం కోరుకున్నారు.
ఇవీ చదవండి: