Diwali Celebrations 2023 in All Over AP: రాష్ట్రవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళిని నిర్వహించారు. శ్రీదేవి, భూదేవీ సమేత మలయప్ప స్వామికి సహస్ర దీపాలంకరణ చేశారు. విజయవాడ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో లక్ష్మీ యాగం.. మార్కాపురంలోని పలు వీధుల్లో నరకాసురుని వధ నిర్వహించారు. అంతేకాకుండా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నరకసుర వధను ఏర్పాటు చేయగా.. ప్రజలు అసక్తిగా తిలకించారు.
Diwali in Tirupati: తిరుమల శ్రీవారి ఆలయంలో పండుగ సందర్భంగా దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉభయదేవేరులతో మలయ్యప్ప స్వామిని సర్వభూపాల వాహనంపై బంగారువాకిలి ముందున్న ఘంటా మండపంలో ఉంచారు. స్వామి వారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదలను చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవీ సమేత మలయప్ప స్వామికి సహస్ర దీపాలంకరణ నిర్వహించారు. అనంతరం మలయప్పస్వామికి మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఆస్థానం వల్ల కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.
"దీపావళి ఆస్థానం వందల సంవత్సరాల నుంచి జరుగుతున్న రితీలోనే ఈ రోజున స్వామి వారి ఆలయంలో.. వైభవంగా జరిగింది. ప్రజలందరూ సుభీక్షంగా ఉండాలని వేంకటేశ్వర స్వామి వారి దీవేనలు అందరికి ఉండాలని ప్రార్థిస్తున్నాము." భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఛైర్మన్
దీపావళి వేడుకల్లో జాగ్రత్త - ఈ తప్పులు అస్సలు చేయకండి
దీపావళి పర్వదినం సందర్భంగా విజయవాడ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో లక్ష్మీ యాగం నిర్వహించారు. మరకత రాజరాజేశ్వరీ అమ్మవారి శ్రీ చక్రం వద్ద నాణాలతో ధనార్చన చేశారు. ప్రతి ఒక్కరి ఇంట్లో సిరి సంపదల విషయంలో ఎటువంటి లోటు ఉండకూడదని ఈ పూజ చేసినట్లు ప్రధాన అర్చకలు ప్రసాద్ శర్మ తెలిపారు. దీపారాధన చేసే ఇంట్లోకి మహాలక్ష్మి దేవి ప్రవేశిస్తుందని ఎంతో మంది నమ్ముతారని ఆయన తెలిపారు.