ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'చేపముళ్లు' డ్రామా ఆడినా ఆశ్చర్యపోనక్కర్లేదు: దివ్యవాణి - divya vani

వైకాపా ఎమ్మెల్యే రోజాపై సినీనటి దివ్యవాణి విరుచుకుపడ్డారు. చంద్రబాబు డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ కానుకగా 10వేల రూపాయలు ఇస్తుంటే.. ప్రతిపక్షం విమర్శించడం సిగ్గుచేటని అన్నారు.

సినీ నటి దివ్యవాణి

By

Published : Feb 4, 2019, 8:20 PM IST

సినీ నటి దివ్యవాణి
పసుపు-కుంకుమ కార్యక్రమాన్ని ప్రతిపక్ష పార్టీ...రాజకీయ కోణంలో చూడటం సిగ్గుచేటని సినీనటి దివ్యవాణి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కనిపించడం లేదా? అని వైకాపా ఎమ్మెల్యే రోజాను ప్రశ్నించారు. తోబుట్టువులు వంటి డ్వాక్రా మహిళలకు అండగా ఉండేందుకు చంద్రబాబు 10 వేల రూపాయలు ఇస్తుంటే దాన్ని విపక్షాలు విమర్శించడం తగదన్నారు. అనంతపురం జిల్లా తోపుదుర్తి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన మంత్రి సునీతను వైకాపా నేతలు అడ్డుకోవటం దారుణమని వ్యాఖ్యానించారు. ప్రజల్ని మభ్యపెట్టేందుకు, ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రతిపక్షనేత జగన్ 'చేపముళ్లు పేరుతో డ్రామా 'ఆడినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు.

ABOUT THE AUTHOR

...view details