తమకు పింఛను మొత్తాన్ని పెంచాలని దివ్యాంగులు కోరుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న 3 వేలు తమ అవసరాలు తీర్చడం లేదని.. ఇకపై నెలకు 10 వేల రూపాయలు ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు.. గుంటూరు జిల్లా పరిషత్తులో జరిగిన స్పందన కార్యక్రమంలో అర్జీలు పెట్టుకున్నారు. వేర్వేరు ఘటనల్లో కాళ్లు, చేతులు కోల్పోయి దివ్యాంగులైన వారు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన చెందారు.
'దివ్యాంగులకు పింఛన్ పదివేలు ఇవ్వాలి' - దివ్యాంగులు
తమకు మూడు వేల రూపాయల పింఛన్ సరిపోవటం లేదని.. నెలకు పదివేలు ఇవ్వాలని కోరుతూ... దివ్యాంగులు గుంటూరు జడ్పీలో జరిగిన స్పందన కార్యాక్రమంలో అర్జీలు పెట్టుకున్నారు.
'దివ్యాంగులకు పింఛన్ పదివేలు ఇవ్వాలి'