బాపట్లలో వైద్య సిబ్బందితో జిల్లా వైద్యాధికారుల సమీక్ష - district_medical_officer_meeting_with_medical_staff_in_bapatla
బాపట్ల నియోజకవర్గంలోని ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న వైద్య సిబ్బందితో గుంటూరు జిల్లా వైద్యాశాఖాధికారులు సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో గర్భీణీల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించారు.
గుంటూరు జిల్లా బాపట్లలో జిల్లా వైద్య శాఖ అధికారులు సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని సిబ్బంది పనితీరుపై ఎన్జీ హోమ్‌లో చర్చించారు. గర్భిణీలకు...వైద్య సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు, సలహాలు ఇచ్చారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టిక ఆహారం, ఎండల తీవ్రతపై ఆరా తీశారు. ఈ కార్యక్రమానికి బాపట్ల ప్రాంతంలోని నాలుగు మండలాల ఏఎన్ఎంలు , సూపర్ వైజర్లు, మెడికల్ ఆఫీసర్లు , హెల్త్ అసిస్టెంట్స్ , 200 మంది సిబ్బంది వరకూ పాల్గొన్నారు.
TAGGED:
జిల్లా వైద్యాధికారులు