ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓటర్ల సవరణ జాబితాపై సమీక్ష

చిత్తూరులోని స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఓటర్ల సవరణ జాబితాపై అధికారులతో ఎలక్టోరల్​ అబ్జర్వర్​ కె.ఆర్.బి.హెచ్.ఎన్. చక్రవర్తి సమీక్ష నిర్వహించారు. జాబితా తయారీలో తప్పులు దొర్లకుండా జాగ్రత్త వహించాలన్నారు.

By

Published : Jan 5, 2021, 8:00 AM IST

review
ఓటర్ల సవరణ జాబితాపై సమీక్ష

జనాభా ప్రాతిపదికన ఉండవలసిన ఓటర్లు, మహిళా ఓటర్ల జాబితా పరిశీలించి తప్పులు లేని ప్రత్యేక ఓటర్ల సవరణ 2020-21ను ప్రచురించాలని చిత్తూరు జిల్లా ఎలక్టోరల్ అబ్జర్వర్ కె.ఆర్.బి.హెచ్.ఎన్. చక్రవర్తి ఆదేశించారు. సోమవారం సాయంత్రం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో జిల్లాలోని 14 నియోజకవర్గాల ఎన్నికల ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో 2020-21 ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితా తయారీపై ఆయన సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ ఈఆర్వోలు, ఏఈఆర్వోలు ఓటర్ల జాబితా సవరణ 2020-21 సమయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

ప్రధానంగా సాఫ్ట్ వేర్ ఆధారంగా డూప్లికేట్ల తొలగింపు, మరణించిన వారి తొలగింపు, వయస్సు మేరకు నమోదు కావాలసిన వారి జాబితా సరి చూసుకోవడం, అధికంగా మహిళా ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాల జాబితా తప్పనిసరిగా పరిశీలించాలని ఆదేశాలిచ్చారు. ప్రతీ తహసీల్దార్ పోలింగ్ కేంద్రాల వారీగా జాబితాను నిశితంగా పరిశీలించాలని తెలిపారు. పలు మండలాల తహసీల్దార్లు, డీటీలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:'కులమతాల మాటున విధ్వంస రాజకీయాలు తగదు'

ABOUT THE AUTHOR

...view details