ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిరువ్యాపారులకు రూ.10వేలు వడ్డీలేని రుణాలు పంపిణీ

చిరువ్యాపారులకు ఎంపీ మోపిదేవి వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశారు. జీడీసీసీ బ్యాంక్ సహకారంతో గుంటూరు జిల్లా రేపల్లె మున్సిపాలిటీ పరిధిలో కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు సీఎం జగన్ నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

interest free loans to small traders
చిరువ్యాపారులకు రూ.10వేలు వడ్డీలేని రుణాలు పంపిణీ

By

Published : Nov 13, 2020, 7:10 PM IST

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు సీఎం జగన్ నిరంతరం కృషి చేస్తున్నారని ఎంపీ మోపిదేవి వెంకటరమణరావు అన్నారు. గుంటూరు జిల్లా రేపల్లె మున్సిపాలిటీ పరిధిలోని చిరువ్యాపారులకు జీడీసీసీ బ్యాంక్ సహకారంతో వడ్డీ లేని రుణాలు కింద రూ.10 వేలు చెక్కును పంపిణీ చేశారు. మునుపెన్నడూ లేని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలను, క్షేత్ర స్థాయిలో అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రాష్ట్రాన్ని దేశంలోనే ముందంజలో ఉంచేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details