గుంటూరులో పేదలకు భోజనం పంపిణీ - guntur corona news updates
లాక్డౌన్ కారణంగా పనులు లేక తిండి లేక ఇబ్బందులు పడుతున్న వారికి గుంటూరులో పలువురు దాతలు ముందుకొచ్చి ఆకలి తీరుస్తున్నారు.

గుంటూరులో పేదలకు భోజనం పంపిణీ
గుంటూరులో రెడ్డి వసతి గృహం నిర్వాహకులు కొత్తపేట ప్రాంతంలో రోజు వారి కూలీలకు ఆహారం అందిస్తున్నారు. హోటళ్లలో పని చేసేవారు, ఏదైనా పనులకు వెళ్లేవారు ప్రస్తుతం లాక్డౌన్తో పస్తులుంటున్న పరిస్థితి ఉందని వారన్నారు. అలాంటి వారికి తాము భోజనం, అరటిపండ్లను అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.