కరోనా వ్యాప్తి నివారణకు పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న కృషిని వెలకట్టలేమని చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని తెలిపారు. కొవిడ్-19 నేపథ్యంలో కొద్దిరోజులుగా మున్సిపల్ సిబ్బంది ఎంతో కష్టపడుతున్నారని కొనియాడారు. ఎమ్మెల్యే రజిని తన సొంత నిధులతో 350 మంది కార్మికులకు కూరగాయలు, మాస్కులు పంపిణీ చేశారు.
పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, కూరగాయలు పంపిణీ - lockdown
దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వ్యాప్తి నివారణకు పారిశుద్ధ్య కార్మికులు అనునిత్యం శ్రమిస్తున్నారు. వీరి సేవలను గుర్తించిన చిలకలూరిపేట ఎమ్మెల్యే రజని తన సొంత నిధులతో కార్మికులకు కూరగాయలు, మాస్కులు పంపిణీ చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు.
పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, కూరగాయలు పంపిణీ