కనెక్ట్ ఆంధ్రా ఆధ్వర్యంలో.. పేదలకు పంపిణీ చేసేందుకు నిత్యావసర సరుకులు సేకరించారు. అవి పేదలకు అందించేందుకు ఏర్పాటు చేసిన వాహనాలను హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరి అక్షయపాత్ర వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. 17 మండలాల్లోని సుమారు 17 వేల మంది వలస కార్మికులకు సుమారు రూ. 700 విలువ చేసే సరుకులను ఒక్కో కుటుంబానికి అందజేయనున్నారు. 17 మండలాల తహసీల్దార్ల ఆధ్వర్యంలో వలస కార్మికులకు వీటిని అందజేస్తారని హోంమంత్రి సుచరిత తెలిపారు. రాష్ట్రంలోని వెంటిలేటర్ల సమస్య లేదని.. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా భారీ స్థాయిలో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లాం చెప్పారు.
వలస కార్మికులకు సరుకుల పంపిణీ - latest updates of corona
కనెక్ట్ ఆంధ్రా ఆధ్వర్యంలో సేకరించిన ఆహార సరుకుల వాహనాలను... హోంమంత్రి మేకతోటి సుచరిత గుంటూరులో ప్రారంభించారు.
distribution-of-goods-to-migrant-workers-in-guntur