ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''అగ్రిగోల్డ్ బాధితులకు రెండు దశల్లో బకాయిల చెల్లింపు'' - distribution of due payments to agrigold victims

దేశ వ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్​లో ఉన్న బాధితులు మాత్రమే ప్రభుత్వం అండ పొందుతున్నారని చెప్పారు. రెండు దశల్లో బాధితులకు బకాయిలు చెల్లిస్తామన్నారు.

అగ్రిగోల్డ్ బాధితులకు రెండు దశల్లో బకాయిల చెల్లింపు

By

Published : Nov 6, 2019, 1:35 PM IST

అగ్రిగోల్డ్ బాధితులకు రెండు దశల్లో బకాయిల చెల్లింపు

దేశ వ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ బాధితులుండగా... ఆంధ్రప్రదేశ్ కు చెందిన బాధితులు మాత్రమే ప్రభుత్వ సహాయం పొందుతున్నారని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు చెప్పారు. ఈ నెల 7న గుంటూరులో సీఎం జగన్... అగ్రిగోల్డ్ బాధితులకు ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు ఆయన తెలిపారు. తొలి దశలో రూ.10 వేల లోపు డిపాజిట్లు ఉన్న ఖాతాదారులకు సాయం అందించనున్నామని... రెండో దశలో 20వేల లోపు ఖాతాదారులకు సాయం అందించనున్నామని ఆయన వివరించారు. ఇసుక కొరతపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో జూన్ నుంచి నవంబర్ వరకు ఇసుక తీయడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఇవన్నీ తెలిసి ప్రతిపక్షాలు రాజకీయం చేయడం తగదన్నారు. ప్రస్తుతం 80 శాతం మేరకు ఇసుక లభ్యత ఉందని....కొద్దిరోజుల్లో పూర్తిస్థాయిలో ఇసుక లభ్యం కానుందన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details