గుంటూరు వైద్య కళాశాలలో వైద్యవిద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు నేడు పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. 2015-21 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు తమ కోర్సు ముగించుకుని వైద్యులుగా సమాజంలోకి అడుగుపెడుతున్నారు. ఎంతో ఉన్నతమైన వృత్తిలోకి ప్రవేశిస్తున్న యువవైద్యులకు కళాశాల డీన్, ప్రిన్సిపల్ అభినందనలు తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు, ముఖ్యంగా పేద వర్గాల వారికి సేవ చేసేందుకు ముందుండాలని సూచించారు. ఈ క్రమంలో విద్యార్థులు తమ స్నేహితులతో సెల్ఫీలు దిగుతూ ఉత్సాహంగా గడిపారు.
గుంటూరు వైద్య కళాశాలలో యువవైద్యులకు పట్టాలు పంపిణీ - guntur latest news
గుంటూరు వైద్య కళాశాలలో విద్యార్థులకు పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. వైద్య కోర్సు ముగించుకుని, యువ వైద్యులుగా సమాజంలో అడుగుపెడుతున్న విద్యార్థులకు కళాశాల డీన్, ప్రిన్సిపల్ అభినందనలు తెలిపారు.
గుంటూరు వైద్య కళాశాలలో యువవైద్యులకు పట్టాలు పంపిణీ