ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పట్టణ ప్రాంతాల్లో 53,66,145 మాస్కుల పంపిణీ - Guntur West

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మాస్కులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు అధికారులు మాస్కులు పంపిణీ చేస్తున్నారు.

guntur district
పట్టణ ప్రాంతాల్లో 53,66,145 మాస్కుల పంపిణీ

By

Published : Apr 20, 2020, 12:47 PM IST

గుంటూరులో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు అధికారులు మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా పాలనాధికారి శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ పరిశీలించారు.

గుంటూరు జిల్లాలోని 13 పట్టణ ప్రాంతాల్లోని 17,88,715 మందికి 53,66,145 మాస్కులు పంపిణీ చేస్తున్నామని, ప్రతి ఒక్కరికీ మూడు మాస్కులు అందించాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో వాటిని ప్రజలకు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. మాస్కుల తయారీలో 13 మున్సిపాలిటీలకు సంబంధించి 14,300 మహిళా టైలర్లు పని చేస్తున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఇది చదవండిరాష్ట్రంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు

ABOUT THE AUTHOR

...view details