లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న నిరాశ్రయులు, పేదలకు గుంటూరు జిల్లా తెనాలిలో జ్ఞానయజ్ఞ ట్రస్టు తరఫున ఆహారం అందిస్తున్నారు. నెల రోజులుగా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతోందని నిర్వాహకులు తెలిపారు. రోజువారి పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదవారికి... వారి ఇంటివద్దకే వెళ్లి ఆహారం అందిస్తున్నారు. సాయంత్రం వేళ చిరుతిండ్లు ఇస్తుండటం విశేషం. లాక్డౌన్ ముగిసేంత వరకూ సాయం కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. తెనాలిలో ఎవరూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపడుతున్నామని వివరించారు.
జ్ఞానయజ్ఞ ట్రస్టు ఆధ్వర్యంలో పేదలకు ఆహారం పంపిణీ - తెనాలిలో పేదలకు ఆహారం పంపిణీ
లాక్డౌన్ కారణంగా పనులు లేక పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి ఇబ్బందులను గమనించి కొందరు తమకు తోచినంత సహాయం అందిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో జ్ఞానయజ్ఞ ట్రస్టు ఆధ్వర్యంలో పేదప్రజలకు, నిరాశ్రయులకు ఆహారం అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.
![జ్ఞానయజ్ఞ ట్రస్టు ఆధ్వర్యంలో పేదలకు ఆహారం పంపిణీ Distributing food to the poor under the Gnanayagam Trust in tenali](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6925497-1018-6925497-1587730948381.jpg)
జ్ఞానయజ్ఞ ట్రస్టు ఆధ్వర్యంలో పేదలకు ఆహారం పంపిణీ