జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య, స్వామి వివేకానంద ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకుని.. గుంటూరు జిల్లాలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. హెచ్.ఐ.వి సోకి బాధపడుతున్న చిన్నారులకు ఈ వితరణ చేశారు. గుంటూరు చుట్టుగుంటలోని పోలేరమ్మ ఆలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఘోర్ అఘాడా ఉప ప్రమోఖ్ రాకేష్నాధ్ జీ అఘోరీ హాజరయ్యారు.
చిన్నారులకు ఆయన చేతుల మీదుగా పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు జ్ఞాన ప్రసన్నాంబ మాట్లాడుతూ.. హెచ్ఐవీ సోకిన పిల్లలకు పౌష్టికాహారం అవసరమని, చాలామంది పేదవారు అది లభించక ప్రాణాపాయస్థితికి చేరుకుంటున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాతలు ముందుకు వచ్చి ఇలాంటి వారిని ఆదుకోవాలని కోరారు.