గుంటూరులోని స్టాల్ గర్ల్స్ హై స్కూల్ లో పోలింగ్ బూత్ వద్ద తెదేపా ఏజెంట్లు ఎక్కువ సమయం పోలింగ్ బూత్‌లోనే ఉన్నారని.. వైకాపా వర్గీయులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమను కూడా పోలింగ్ బూత్‌లోకి అనుమతించాలని.. లేదంటే తెదేపా ఏజంట్లను బయటకు పంపాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, వైకాపా నాయకులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఆ తర్వాత పరిస్థితి సద్దుమణిగింది.
వైకాపా నాయకులు పోలీసులకు మధ్య వాగ్వాదం - గుంటూరులో పోలీసులకు వైకాపా నాయకుల మధ్య ఘర్షణ
పోలింగ్ బూత్‌లో నుంచి తెదేపా ఏజెంట్లు బయటకు రావట్లేదని.. గుంటూరు జిల్లా స్టాల్ గర్ల్స్ హై స్కూల్ పోలింగ్ బూత్‌లో వైకాపా వర్గీయులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులకు, వైకాపా నాయకులకు మధ్య స్వల్ప తోపులాట నెలకొంది.

వైకాపా నాయకులు పోలీసులకు మధ్య వాగ్వాదం
వైకాపా నాయకులు పోలీసులకు మధ్య వాగ్వాదం