గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని రైన్ ట్రీ విల్లా సముదాయం ముందు కొవిడ్-19 డిస్ ఇన్ఫెక్షన్ టన్నెల్‌ను సిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సంస్థ ఏర్పాటు చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు నివాసం ఉండే ఈ అపార్టుమెంట్ వద్దకు ప్రజలు వివిధ పనులపై రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రక్షణ చర్యల్లో భాగంగా సొంతంగా తయారు చేయించి ఏర్పాటు చేసినట్లు సిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దీన్ని ప్రారంభించారు.
మంత్రుల నివాస సముదాయం వద్ద డిస్ ఇన్ఫెక్షన్ టన్నెల్ ఏర్పాటు - ఏపీ కరోనా వార్తలు
కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు సరికొత్తగా తయారుచేసిన డిస్ ఇన్ఫెక్షన్ టన్నెళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. నివాస ప్రాంగణాలు, కార్యాలయాలు, రద్దీ ప్రాంతాల్లో పలువురు వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. మంగళగిరిలోని రైన్ ట్రీ విల్లా సముదాయం వద్ద ఓ టన్నెల్‌ను ఏర్పాటు చేశారు.
dis infection tunnels
నీటిలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం కలిపి నాజిల్ స్ప్రే ద్వారా టన్నెల్‌లో పిచికారీ చేస్తారు. ఈ టన్నెల్‌లోకి మనిషి రాగానే పంపులు వాటంతట అవే రసాయనాలను స్వల్ప మోతాదులో దేహంపై పిచికారీ చేస్తాయి. ఈ టన్నెల్‌లో 20 సెకన్లపాటు ఉంటే అన్ని రకాల ఇన్ఫెక్షన్లు శరీరం నుంచి తొలగిపోతాయని సిమ్స్ ప్రతినిధులు తెలిపారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో మరో కరోనా బాధితుడు