రాజధానికి మద్దతుగా దివ్యాంగుల వాహన ర్యాలీ - రాజధాని రైతుల నిరసన
రాజధాని రైతులకు మద్దతుగా దివ్యాంగులు మోటార్ వాహన ర్యాలీని నిర్వహించారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని వారు నినదించారు. గుంటూరు నుంచి మందడం వరకు ర్యాలీ చేపట్టారు. రాష్ట్రాన్ని మూడు రాజధానులుగా విభజించవద్దని దివ్యాంగుల ఆర్థిక సంక్షేమ సంస్థ మాజీ చైర్మన్ కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగుల పింఛను నిలిపివేసినా బాధలేదని... అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరారు. రాజధానిని అమరావతిలో కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటన చేసే వరకు ఉద్యమం విరమించేది లేదని స్పష్టం చేశారు.
రాజధానికి మద్దతుగా దివ్యాంగుల మోటార్ వాహన ర్యాలీ