గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య అనంతర పరిణామాలపై రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ స్పందించారు. పోలీసులకు ఎవరైనా సమానమే అని స్పష్టం చేశారు. ‘మృతురాలి నివాసం వద్ద పరిస్థితి అదుపు తప్పినప్పుడు అందరికీ సర్ది చెబుతున్నప్పుడు మాజీ మంత్రి ఆనందబాబుపై చేయి చేసుకున్నానంటూ కొన్ని మాధ్యమాల్లో రావడం బాధాకరం. కులమతాలకు అతీతంగా సేవ చేస్తుంటా. తప్పనిసరి పరిస్థితుల్లో చెబుతున్నా.. కర్ణాటకలోని దళిత కుటుంబానికి చెందిన పోలీసు అధికారిగా రాజ్యాంగబద్ధంగా పని చేస్తున్నా. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఏ పార్టీ వారైనా చర్యలు తీసుకుంటాం. ఈరోజు తోపులాటలో నాకూ దెబ్బలు తగిలాయి. విధుల్లో ఇవన్నీ సాధారణమేననుకుని పని చేశా’ అని రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు.
'మాకు అలాంటి ఉద్దేశాలు ఉండవు.. తప్పనిసరై చెబుతున్నా' - Ramya's murder latest news
రమ్య హత్య అనంతర పరిణామాలపై గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ స్పందించారు. తెదేపా నేత ఆనందబాబుపై చేయి చేసుకున్నారని వచ్చిన వార్తలపై వివరణ ఇచ్చారు. కులమతాలకు అతీతంగా తాము సేవ చేస్తామని.. ఇలాంటి ఆరోపణలు రావడం బాధాకరమని అన్నారు.
వివరాలు వెల్లడిస్తున్న ఇన్ఛార్జి డీఐజీ రాజశేఖర్ బాబు
Last Updated : Aug 17, 2021, 9:29 AM IST