Differences between YCP leaders: గుంటూరు జిల్లా తాడేపల్లిలో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. పట్టణ అధ్యక్షురాలు పార్వతి.. తనపై అసత్య ప్రచారాలు చేశారని పురపాలక సంఘం మాజీ చైర్పర్సన్ కొయ్యగూర మహాలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల పార్టీ నిర్వహించిన సర్వేలో తనపై పార్వతమ్మ అసత్య ప్రచారం, ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరో మాజీ కౌన్సిలర్ కేలి వెంకటేశ్వరరావు సైతం పార్వతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాడేపల్లి వైసీపీలో విభేదాలు.. పోలీసుస్టేషన్‌కు చేరిన గొడవ
Differences between YCP leaders: వైసీపీలో విభేదాల పోరు నడుస్తోంది. తాజాగా గుంటూరు జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య ఏర్పడిన విభేదాలు రచ్చకెక్కాయి. ఒకే పార్టీ వారు అసత్య ప్రచారం చేశారని మాజీ చైర్ పర్సన్ కొయ్యగూర మహాలక్ష్మి, మాజీ కౌన్సిలర్ కేలి వెంకటేశ్వరరావులు పట్టణ అధ్యక్షురాలైన పార్వతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వైసీపీ
తనను కేడీగా, జూదగాడిగా అభివర్ణించిన పార్వతిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్వతి వెనుక శాసనసభ్యులు ఉన్నట్లు ఫిర్యాదు చేసిన నేతలు అనుమానిస్తున్నారు. వైసీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి జగన్ నివాసం ఉంటున్న తాడేపల్లిలోనే పార్టీ పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలలో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని నేతలు భావిస్తున్నారు.
ఇవీ చదవండి: