ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Diesel Price: బయటి బంకుల్లో ఆర్టీసీ బస్సులకు డీజిల్​.. ఎందుకంటే..! - ఆర్టీసీకి భారమైన డీజిల్‌ ధర

Diesel price burden in RTC: నిత్యం లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగించే ఆర్టీసీకి.. చమురు సంస్థలు బయటి మార్కెట్‌ కంటే తక్కువ ధరకు సరఫరా చేస్తుంటాయి. కానీ గత వారం పదిరోజులుగా బయట విక్రయించే ధర కంటే ఆర్టీసీకి ఇచ్చే ధర లీటర్‌కు రూ.4.30 వరకు చమురు సంస్థలు పెంచేశాయి. దీంతో ఆర్టీసీపై భారం పెరగడంతో.. అన్ని బస్సులకూ బయటి బంకుల్లో డీజిల్‌ నింపుకోవాలంటూ ఆర్టీసీ ఎండీ ఉత్తర్వులు జారీ చేశారు.

Diesel price burden in RTC
Diesel price burden in RTC

By

Published : Feb 22, 2022, 7:39 AM IST

Diesel price burden in RTC: నిత్యం లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగించే ఆర్టీసీకి.. చమురు సంస్థలు బయటి మార్కెట్‌ కంటే తక్కువ ధరకు సరఫరా చేస్తుంటాయి. అయితే వారం పదిరోజులుగా బయట విక్రయించే ధర కంటే ఆర్టీసీకి ఇచ్చే ధర లీటర్‌కు రూ.4.30 వరకు చమురు సంస్థలు పెంచేశాయి. దీంతో ఆర్టీసీపై భారం పెరగడంతో.. అన్ని బస్సులకూ బయటి (రిటైల్‌) బంకుల్లో డీజిల్‌ నింపుకోవాలంటూ సంస్థ ఎండీ సీహెచ్‌.ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీచేశారు.

ఆర్టీసీలో 10 వేల బస్సులకు నిత్యం సగటున 7.30 లక్షల లీటర్ల (నెలకు దాదాపు 2.2 కోట్ల లీటర్లు) డీజిల్‌ వినియోగిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 129 డిపోలు ఉండగా, ఆయా చమురు సంస్థలు డిపోలకు డీజిల్‌ సరఫరా చేస్తాయి. అక్కడ ఆర్టీసీ సొంత బస్సులతోపాటు, అద్దె బస్సులకు కూడా ఈ డీజిల్‌ను నింపుతుంటారు. చమురు సంస్థలు మూల ధరలలో కొంత రాయితీ ఇస్తుంటాయి. దీనివల్ల బయటి బంకులతో పోలిస్తే, ఆర్టీసీకి సరఫరా చేసే డీజిల్‌ ధర లీటర్‌కు రూ.2 వరకు తక్కువగా ఉండేది.

కొద్ది రోజులుగా బయటి బంకుల్లో విక్రయించే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగకుండా స్థిరంగా ఉన్నాయి. డీజిల్‌ ఆయా జిల్లాలను బట్టి లీటర్‌ రూ.96 - రూ.97 వరకు ఉంది. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే వీటిలో హెచ్చుతగ్గులు లేకుండా, స్థిరంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ ధర క్రమంగా పెరుగుతుండటంతో ఆర్టీసీకి సరఫరా చేసే డీజిల్‌కు మూల ధరను పరిగణనలోకి తీసుకునే చమురు సంస్థలు.. బ్యారెల్‌ ధర ప్రకారం ధర పెంచినట్లు చెబుతున్నారు. దీంతో లీటర్‌పై బయటి బంకుల్లో ధర కంటే, ఆర్టీసీకి లీటర్‌కు రూ.4.30 ఎక్కువకి సరఫరా చేస్తున్నాయి. దీనివల్ల బయటి బంకుల్లో లభించే డీజిల్‌ ధరతో లెక్కిస్తే.. ఆర్టీసీ నెలకు దాదాపు రూ.10 కోట్ల మేర నష్టపోవాల్సి వస్తోంది. ఈ పరిణామాలతో ఆర్టీసీ అధికారులు సోమవారం సమీక్ష నిర్వహించారు. కొంత కాలం ఆర్టీసీ డిపోల్లో కాకుండా.. బయటి బంకుల్లో డీజిల్‌ నింపుకోవాలంటూ ఎండీ ఉత్తర్వులు జారీచేశారు. వీటిని వెంటనే అమలు చేయాలని అన్ని జిల్లాల ఆర్‌ఎంలను ఆదేశించారు.

ఇదీ చదవండి:

YS Viveka Murder Case: 'బాబాయ్ హత్య కేసుపై సీఎం ఇప్పటికైనా స్పందించాలి'

ABOUT THE AUTHOR

...view details