ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సరైన ఆహార నియమాలు పాటిస్తే మధుమేహం దూరం' - బరువు నియంత్రణ

గుంటూరు జిల్లా తెనాలి ఆసుపత్రికి చెందిన వైద్యుడు ఎస్.వి.కృష్ణారావు 'మధుమేహంతో సుఖమయ జీవితం ఎలా?' అనే పుస్తకాన్ని రోగులకు పంపిణీ చేశారు. ప్రపంచ మధుమేహ నివారణ దినోత్సవం సందర్భంగా రోగులకు పలు సూచనలు చేశారు.

'Diabetes can be avoided
'సరైన ఆహార నియమాలు పాటిస్తే మధుమేహం దూరం'

By

Published : Nov 14, 2020, 7:20 PM IST

ప్రపంచ మధుమేహ నివారణ దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా తెనాలి ఆసుపత్రికి చెందిన వైద్యుడు ఎస్.వి.కృష్ణారావు రోగులకు పలు సూచనలు చేశారు. వ్యాధిపై వారికి పూర్తి అవగాహన కల్పించేందుకు ఆయన రాసిన 'మధుమేహంతో సుఖమయ జీవితం ఎలా?' అనే పుస్తకాన్ని పంపిణీ చేశారు.

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో అన్ని వయసుల వారిని మధుమేహం ఇబ్బంది పెడుతోందన్నారు. సరైన ఆహార నియమాలు, బరువు నియంత్రణ, మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలని సూచించారు. వ్యాయామం, నడకతో వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవాలని రోగులకు ఆయన వివరించారు.

ABOUT THE AUTHOR

...view details