ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ప్రజలు అండగా నిలిచారు: ధూళిపాళ్ల

Sangam Dairy Board Meeting: ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతులు, వినియోగదారులు తమ సంస్థకు అండగా ఉన్నారని సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. ప్రభుత్వం ఏసీబీతో కలిసి సంగం డెయిరీ ప్రతిష్టను దిగజార్చాలని చూస్తోందన్నారు.

Dhulipalla Narendra
ధూళిపాళ్ల నరేంద్ర కుమార్

By

Published : Dec 19, 2022, 7:57 PM IST

Sangam Dairy Board Meeting: రాజకీయ కక్షతోనే మంత్రి అప్పలరాజు సంగం డెయిరీపై ఆరోపణలు చేస్తున్నారని.. సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. ప్రభుత్వం ఏసీబీతో కలిసి సంగం డెయిరీ ప్రతిష్టను దిగజార్చాలని చూస్తోందన్నారు. డెయిరీకి రావలసిన రీయింబర్స్​మెంట్ ఇవ్వకుండా ఎన్​డీడీబీపై ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలో సంగం డెయిరీ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు నరేంద్ర వెల్లడించారు. సంక్రాంతి నాటికి ప్రోటీన్లతో కూడిన నూతన ఎనర్జీ డ్రింకులను మార్కెట్లోకి తీసుకువస్తామన్నారు. దేశవాళీ పశువుల నుంచి సేకరించిన ఏ2 ప్రోటీన్ ఉన్న పాలు, పాల ఉత్పత్తులను ప్రత్యేక బ్రాండ్​గా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.

సంఘం డెయిరీ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు వెల్లడించిన ధూళిపాళ్ల

"మంత్రి అప్పలరాజు సంగం డెయిరీపై చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే. ప్రభుత్వం ఏసీబీతో కలిసి సంగం డెయిరీ ప్రతిష్టను దిగజార్చే కుట్రలో భాగమే ఈ ఆరోపణలు. అదేవిధంగా ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించి ఎన్​డీడీబీపై ఒత్తిడి తీసుకొచ్చి..రీయింబర్స్​మెంట్ రాకుండా చేయాలనే ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. రైతులు, వినియోగదారులు తమకు అండగా ఉన్నారు". -ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, సంగం డెయిరీ ఛైర్మన్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details