Dhulipalla Narendra Padayatra Over Gravel Mining:ఎక్కడ ఖాళీ స్థలాలు కనిపించినా ఈ వైఎస్సార్సీపీ నాయకులు వదిలే పరిస్థితి కనిపించటంలేదు. అది పేదల భూమా, ప్రభుత్వ భూమా, దేవాదాయ శాఖ భూమా అన్న విషయం వాళ్లకు పట్టదు. కొండలు, గుట్టలను సైతం తవ్వేసి మట్టిని అమ్ముకోవటమే కాకుండా వాటిని చదును చేసి రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారుస్తున్నారు.
TDP Leader Dhulipalla Narendra Padauyatra: పొన్నూరు నియోజకవర్గంలో గ్రావెల్ మాఫియా(Gravel Mafia) ధనదాహానికి 700 ఎకరాలకు పైగా పండ్ల తోటలు కనుమరుగయ్యాయని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్(Former MLA Dhulipalla Narendra Kumar) ఆరోపించారు. అక్రమ మట్టి తవ్వకాలను నిరసిస్తూ ఆయన రెండ్రోజుల పాటు పాదయాత్ర చేపట్టారు. చేబ్రోలు మండలం శ్రీరంగపురం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ఏడు గ్రామాల పరిధిలోని క్వారీలను పరిశీలిస్తూ ఆయన పాదయాత్ర సాగనుంది.
Devineni Uma Fire on CM Jagan: ముఖ్యమంత్రి అండదండలతోనే రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నేతలు ఎక్కడికక్కడ అడ్డగోలుగా మట్టి తవ్వకాలు( YSRCP Leaders Illegal soil Excavation in AP) చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా(Former Minister Devineni Uma) ఆరోపించారు. గ్రావెల్ మాఫియాకు వ్యతిరేకంగా పొన్నూరు నియోజకవర్గంలో ధూళ్లిపాళ్ల నరేంద్ర చేపట్టిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఇక్కడ తవ్వకాలను చేస్తున్న ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(AP CM Jagan) తాడేపల్లి ప్యాలెస్‌కు పిలుపించుకుని వాటాలు మాట్లాడుకుని పంపించారని ఆరోపించారు. అక్రమ తవ్వకాలు చేసిన వారికి 5కోట్ల రూపాయల జరిమానా వేశామని చెప్పిన గనులశాఖ డైరెక్టర్(Director of Mines) ఒక్క పైసా కూడా ఎందుకు వసూలు చేయలేదని ప్రశ్నించారు.
"సీఎం జగన్మోహన్ రెడ్డి అండదండలతోనే రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నేతలు ఎక్కడికక్కడ అడ్డగోలుగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. ఇక్కడ తవ్వకాలను చేస్తున్న ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(AP CM Jagan) తాడేపల్లి ప్యాలేస్‌కు పిలుపించుకుని వాటాలు మాట్లాడుకుని పంపించారు. అక్రమ తవ్వకాలు చేసిన వారికి 5కోట్ల రూపాయల జరిమానా వేశామని చెప్పిన గనులశాఖ డైరెక్టర్ ఒక్క పైసా కూడా ఎందుకు వసూలు చేయలేదు?" - దేవినేని ఉమా, మాజీ మంత్రి
Illegal Mining in AP: జగనన్న కాలనీ(Jagananna Colonies) పేర్లు చెప్పి వైఎస్సార్సీపీ నేతలు(YSRCP Leaders) మట్టి దోపిడీకి పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్(Former MLA Tenali Shravan Kumar) ఆరోపించారు. అక్రమాలు అడ్డుకోవాల్సిన అధికారులే వైఎస్సార్సీపీ నేతలకు సహకరిస్తున్నారని విమర్శించారు. ఈ పాదయాత్రలో జనసేన పొన్నూరు ఇంఛార్జి వడ్రాణం మార్కండేయ బాబు, జనసైనికులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నేతలు చేస్తున్న అరాచకాలపై పోరాటంలో జనసేన కలిసి వస్తుందన్నారు.