సంగం డెయిరీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గుంటూరు జిల్లా చింతలపూడి గ్రామంలోని ఇంటి వద్ద ఈరోజు ఉదయం ఏసీబీ పోలీసులు అరెస్టు చేశారు.
"ఉదయం ఆరు గంటల సమయంలో సుమారు 100 మంది పోలీసుల వరకు వచ్చారు. నరేంద్ర కుమార్ ఎక్కడ అని ప్రశ్నించారు. బాత్రూం లో ఉన్నారని చెబుతున్నప్పటికీ.. వినకుండా కనీసం దుస్తులు మార్చుకునేందుకు అవకాశం ఇవ్వకుండా తీసుకువెళ్లారు". ధూళిపాల జ్యోతిర్మయి ,నరేంద్ర భార్య